NLG: రాఖీ పౌర్ణమి సందర్భంగా దేవరకొండ-హైదరాబాద్ మార్గంలో ఈనెల 28, 31 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు దేవరకొండ డిపో మేనేజర్ విజయకుమారి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీపై 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ఆమె తెలియజేశారు.
తెలంగాణ
దేవరకొండ డిపో నుంచి రాఖీకి ప్రత్యేక బస్సులు


