BDK: దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ వివిధ గ్రామాలలో పర్యటించారు. మండలంలోని జగ్గారం గ్రామంలో కూరం నాగరాజుకి దివ్యాంగుల కోసం ప్రభుత్వం అందిస్తున్న బ్యాటరీతో ఛార్జింగ్ చేసుకుని నడిచే నాలుగు చక్రాల వాహనాన్ని వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
దివ్యాంగుడికి వాహనం అందజేత..!


