హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ముదిరాజ్ హక్కులపై అసెంబ్లీలో మాట్లాడాలి'

SDPT: ముదిరాజ్ హక్కుల గూర్చి అసెంబ్లీ సమావేశాలలో మాట్లాడాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును ముదిరాజ్ హక్కుల సాధన సమితి నాయకులు కోరారు. ఈ మేరకు వారు ఎమ్మెల్యే ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముదిరాజ్ లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.