JGL: సిరికొండ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి రూ.50 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచ్ ముదాం రవి, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భూమిపూజ


