హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

JGL: అర్హులైన పేదలందరికీ పారదర్శకంగా సరుకులు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తోందని సర్పంచ్ గుమ్మడి సంతోష్, జీపీఓ అంజలి అన్నారు. బుధవారం కుమ్మరిపల్లి గ్రామంలో లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ కార్డుల వల్ల రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ఉపసర్పంచ్ శేఖర్, డీలర్ శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.