హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్వోత్తమ్

SRPT: సూర్యాపేటలోని 36వ వార్డులో మున్సిపల్ జనరల్ నుంచి మంజూరైన రూ. 5లక్షలతో కల్వర్టు నిర్మించనున్నారు. ఈ నిర్మాణానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ నివేదిత లక్ష్యాదితో కలిసి ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో ఈ వార్డు వెనుకబడిపోయిందని, గోపాలపురం చర్చి నుంచి జాతీయ రహదారి 60 ఫీట్ల రోడ్డు అనుసంధానానికి కృషి చేస్తానన్నారు.