హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాఖీకి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

మెదక్ జిల్లాలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు మెదక్ రీజియన్ పరిధిలో 250 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం భాస్కర్ తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు. పండుగకు రెండు రోజుల ముందుగానే బుధవారం నుంచే ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయన్నారు.