హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్లేయర్ల దూకుడుపై మంజ్రేకర్ కామెంట్స్

ప్రత్యర్థి ఆటగాళ్లపైకి దూసుకెళ్లేంత దూకుడైన ప్రవర్తన యువ క్రికెటర్లకు ఏమాత్రం మంచిది కాదని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ హితవు పలికాడు. గ్రౌండ్‌లో ప్లేయర్ అనుచిత ప్రవర్తన, దూకుడును అణచివేయడానికి బోర్డులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఈ నేపథ్యంలోనే BCCI, ICCలు తక్షణమే జోక్యం చేసుకుని ఇలాంటి ఘటనలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.