హైదరాబాద్: 28°C
క్రీడలు

శ్రీలంకపై పట్టుబిగించిన టీమిండియా

కొలొంబో టెస్ట్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. సోనాల్ దినుష(103) శ్రమించినా జట్టును కాపాడలేకపోయాడు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 503/9 వద్ద డిక్లేర్ చేయగా, లంకపై భారత్‌కు 213 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ 3, సుథార్ 3, సారాంశ్ జైన్ 2 వికెట్లు పడగొట్టారు.