హైదరాబాద్: 28°C
క్రీడలు

లంక బ్యాట‌ర్ అరుదైన రికార్డు!

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్‌ సోనల్‌ దినూష (85*) అజేయ పోరాటం కొనసాగిస్తున్నాడు. వరుసగా వికెట్లు పడుతున్నా పట్టుదలగా ఆడుతూ భారత్‌కు కొరకరాని కొయ్యగా మారాడు. కాగా, భారత్‌తో జరిగిన టెస్టుల్లో తన తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ 80కి పైగా పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా దినూష అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.