MBNR: మిడ్జిల్ మండలం మల్లాపూర్‌లోని పలు వీధుల్లో మురుగు నీరు, చెత్త పేరుకుపోవడంతో తీవ్రమైన దోమల బెడద ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోగాలు ప్రబలే ప్రమాదం ఉన్నా అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. తక్షణమే డ్రైనేజీలను శుభ్రం చేసి, ఫాగింగ్ చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
దోమల బెడద.. పట్టించుకోని అధికారులు


