హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా రేషన్ బియ్యం పట్టివేత..!

SRD: నర్సాపూర్-హత్నూర మండలాల పరిధిలోని రైస్ మిల్లుల నుండి మహారాష్ట్రకు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. నర్సాపూర్-దౌల్తాబాద్ చౌరస్తా వద్ద నిర్వహించిన తనిఖీల్లో పాషామైలారం వైపు వెళ్తున్న లారీని అడ్డుకుని,అందులోని 250 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.