హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాటరాయుళ్ల అరెస్టు..!

KNR: కరీంనగర్ శర్మన గర్ లోని ఒక ఇంటిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను మంగళవారం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 7,730 రూపాయల నగదుతో పాటు 8 సెల్ ఫోన్లను సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. పట్టుబడినవారిలో ఒక మున్సిపల్ ఉద్యోగి, రాజకీయనాయకుల అనుచరులు ఉన్నట్లు సమాచారం.