హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగు

NGKL: జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్, మొక్కజొన్న, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే సోమశిల, నల్లమల్ల, మన్ననూరు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.