SRD: పటాన్‌చెరు టౌన్‌లోని చిన్న మసీదు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రామచంద్రాపురానికి చెందిన బంటు యాదగిరి (51) బైక్‌పై ఇంటికి వస్తుండగా రోడ్డుపై ఎలాంటి లైట్లు, హెచ్చరికలు లేకుండా నిలిపిన ట్రాలీ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
పటాన్చెరులో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి


