హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గోశాలలో కోడెల మృతిపై ఆది శ్రీనివాస్ ఆవేదన

SRCL: తిప్పాపూర్‌లోని రాజరాజేశ్వర స్వామి గోశాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం ఉదయం సందర్శించారు. గోశాలలో కోడెల మృతి బాధాకరమని అన్నారు. వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని, పచ్చిమేతతో పాటు పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. భక్తులు చిన్న వయసు కోడెలను మొక్కుగా సమర్పించడం వల్ల వాటి సంరక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.