NRML: ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ అంకం మౌనిక ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని పరిస్థితులను పరిశీలించి, విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. ఇటీవల పాఠశాలలో జరిగిన పరికరాల ధ్వంసం ఘటనపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
పాఠశాలను సందర్శించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్


