హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది: మంత్రి

KNR: సైదాపూర్(M) ఘణపూర్లో జరిగిన 'పల్లె పల్లెకు పొన్నం అన్న‌'లో మంత్రి ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామంలో రూ.2.91 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, త్వరలో రూ.9.5 కోట్లతో సోమారం-రాయికల్ రోడ్డు నిర్మిస్తామన్నారు.6వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. అర్హులకు రేషన్ కార్డులు పంపిణీ చేసి, రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకాల ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.