PDPL: పెద్దపల్లి జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా గోదావరిఖనికి చెందిన ఎల్తూరి సరిత నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి మంగళవారం ప్రకటించారు. తన ఎన్నికకు కృషి చేసిన మహిళా మోర్చా అధ్యక్షురాలు వడ్డేపల్లి భారతి, పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ
BJP మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా సరిత


