హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి!

SRPT: కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.