హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుకపై రెవెన్యూ అధికారుల కొరడా

MBNR: జడ్చర్ల మండలం అమ్మపల్లి, కుర్వగడ్డపల్లి శివారులోని మీనాంబరం ఆలయ ప్రాంగణంలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన సుమారు 75 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మిడ్జిల్ మండలం భైరంపల్లి నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలించినట్లు విచారణలో తేలింది. అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మార్వో హెచ్చరించారు.