NRML: నిర్మల్ భైంసా మండలం మాంజ్రి శివారులో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కోలూర్ వాసి ప్రసాద్ (24) మృతి చెందాడు. స్థానికుల ప్రకారం.. విధి నిర్వహణ ముగించుకుని బైక్‌పై వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మరణించాడు. ప్రసాద్‌కు ఆరు నెలల కిందటే శ్రుతితో ప్రేమ వివాహం జరగడంతో కుటుంబంలో విషాదం చోటుచేసింది.
తెలంగాణ
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి


