హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడుపాయల అమ్మవారికి ప్రత్యేక పూజలు

మెదక్ జిల్లాలోని ప్రముఖ దివ్యక్షేత్రం ఏడుపాయలలో బుధవారం శ్రీ వనదుర్గాభవానీ అమ్మవారు నిత్యాలంకరణలో భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు. వేదపండితులు శాస్త్రోక్తంగా సుప్రభాత సేవ, విశేష అర్చనలు, దివ్యాంబర ధారణ నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణలు, దుర్గానామజపాలతో మార్మోగింది.