మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వానకు పట్టణ ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ వర్షాల దాటికి శిథిలావస్థకు చేరిన ఇళ్లు, గుడిసెలు ప్రమాదకరంగా మారాయి. పాత భవనాలను తక్షణమే ఖాళీ చేసి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ
రామాయంపేటలో ఎడతెరిపి లేని ముసురు


