హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైస్ మిల్లుపై దాడులు.. కేసు నమోదు

MHBD: కేసముద్రం మండలం భూక్యారాంతండాలో మహాదేవ ఆగ్రో ఇండస్ట్రీస్‌పై మంగళవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఖరీఫ్ 2023- 24లో కేటాయించిన ధాన్యంలో 1,586 మెట్రిక్ టన్నులకు పైగా సీఎంఆర్ బియ్యం అందించలేదని గుర్తించారు. దీంతో ప్రభుత్వానికి రూ. 6.46 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మిల్లర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.