హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఏదులలో వనమహోత్సవం నిర్వహించారు'

WNP: ఏదుల మండల కేంద్రంలోని హెల్త్ సబ్ సెంటర్ ఆవరణలో హెల్త్ అసిస్టెంట్ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో వనమహోత్సవం నిర్వహించారు. ఆశా కార్యకర్తలు పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటామని శ్రీలక్ష్మి తెలిపారు. నాటిన మొక్కలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.