హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ దొంగ సంచారం కలకలం..!

WGL: వరంగల్ రంగశాయిపేటలో బైక్ దొంగ సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. బైక్ చోరీకి వచ్చినట్లు అనుమానిస్తున్న వ్యక్తి వీధుల్లో సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనుమానాస్పద వ్యక్తిని గుర్తించిన స్థానికులు మంగళవారం మిల్స్ కాలనీ పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వ్యక్తిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.