హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా మిలాదున్ నబీ వేడుకలు

KMR: గాంధారి మండలoలోని జామా మసీదులో మిలాదున్ నబీ వేడుకలను రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత గురువు మొహమ్మద్ సాజిద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దువా చేశారు. మిలాదున్ నబీ విశిష్టతను, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన శాంతి, సోదరభావం, మానవత్వం వంటి సందేశాలను మత గురువు వివరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఉన్నారు.