హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ చౌరస్తాలో లారీ- బస్సు ఢీ..!

JN: ఆర్టీసీ చౌరస్తాలో మంగళవారం రాత్రి మహారాష్ట్రకు చెందిన లారీ, జనగామ ఆర్టీసీ డిపో పరిధిలో నడుస్తున్న అద్దె ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు ధ్వంసం కాగా, లారీకి స్వల్పంగా డ్యామేజ్ అయింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు.