హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

22ఏ భూ సమస్యలపై 449 దరఖాస్తులు: కలెక్టర్

ELR: జిల్లాలో జూన్ 15 నుంచి ఆగస్టు 24 వరకు 22ఏ భూ సమస్యలపై 449 దరఖాస్తులు అందగా, 180 పరిష్కరించినట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జయలక్ష్మి మంగళవారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ వివరాలు వెల్లడించారు. నిబంధనలకు అనుగుణంగా లేని 182 దరఖాస్తులను కారణాలు తెలియజేస్తూ తిరస్కరించామని తెలిపారు.