నెల్లూరు: ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామ సమీపంలోని పంట కాలువ వద్ద మొసలి సంచారం మంగళవారం రాత్రి కలకలం రేపింది. కాలువ సమీపంలో మొసలిని రైతులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. మొసలిని పట్టుకునేందుకు బుధవారం ఉదయం అటవీశాఖ అధికారులు అక్కడికి రానున్నారు. గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ముత్తుకూరులో మొసలి కలకలం


