హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

WG: కాళ్లలోని 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో 11 కేవీ ఫీడర్ మరమ్మతుల నిమిత్తం బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీసలి, కోమటిగుంట, సూర్యారావుపేట, చినపుల్లేరు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.