హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కుర్నవల్లి సొసైటీలో యూరియా పంపిణీ

KMM: తల్లాడ మండలంలోని కుర్నవల్లి పీఏసీఎస్‌లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి యూరియా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఎరువులు అవసరమైన రైతులు తప్పనిసరిగా ‘ఫెర్టిలైజర్‌ యాప్‌‌లో ముందుగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకోవాలని సూచించారు. బుక్‌ చేసుకున్న రైతులకు ఉదయం 10 గంటల నుంచి యూరియా పంపిణీ చేస్తామని తెలిపారు.