KRNL: పెద్దకడబూరు(M) పులికనుమ గ్రామంలో వీధి లైట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో గ్రామంలోని ప్రధాన వీధులు చీకటిమయంగా మారడంతో అత్యవసర పనులపై బయటకు రావాలన్నా ప్రజలు భయపడుతున్నారు. రాత్రిళ్ళు పాములు, తేళ్లు సంచరించే అవకాశం ఉండటంతో మహిళలు, చిన్నారులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే వీధి లైట్లు ఏర్పాటు చేయాలన్నారు
ఆంధ్రప్రదేశ్
వీధిలైట్లు లేక.. వీధులు చీకటిమయం


