JNG: విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనలో తొర్రూర్ పట్టణంలోని ఆర్యభట్ట స్కూల్ వార్డెన్, యాజమాన్యంపై కేసు నమోదైంది. తమ కుమారుడిని వార్డెన్ కఠినంగా వేధించడంతోనే ఆత్మహత్యకు యత్నించాడని తండ్రి రవి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, ఆధారాలు సేకరిస్తున్నామని ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
పాఠశాల వార్డెన్, యాజమాన్యంపై కేసు నమోదు


