హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఆర్వోగా గ్లోరియా బాధ్యతల స్వీకరణ

W.G: జిల్లా రెవెన్యూ అధికారిగా పి. గ్లోరియా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ఇన్ఛార్జ్ డీఆర్వోగా ఉన్న పి. ప్రభాకర్ నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. రెవెన్యూ వ్యవస్థలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు.