హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

32.590 కిలోల గంజాయి పట్టివేత

SKLM: ఒడిశాలోని పర్లాకిమిడి నుంచి తమిళనాడుకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను కాశీబుగ్గ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 32.590 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ టి. భవాని నిన్న తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.