WG: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై మద్యం రవాణాలో అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. తణుకు వైసీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పరిపాలనలో విఫలమై, ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి అక్రమ అరెస్టులకు తెరతీసిందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
డైవర్షన్ కోసమే అక్రమ అరెస్టులు: ప్రసాదరాజు


