హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి జాప్యం

WGL: హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో 168 అంగన్‌వాడీ టీచర్, 745 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భర్తీకి నోటిఫికేషన్ విడుదలై నెలలు గడుస్తున్నా నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. సిబ్బంది కొరతతో కొన్ని కేంద్రాలను ఒకే టీచర్ నిర్వహించాల్సి వస్తుండటంతో చిన్నారులకు సేవల్లో ఇబ్బంది పడుతున్నట్లు ప్రజలు పేర్కొన్నారు.