MBNR: నవాబ్ పేట మండలం కొత్తపల్లిలో గ్రామానికి చెందిన రాములమ్మ(55) మంగళవారం పొలంలో పైరు తడిపేందుకు వెళ్లగా బోరు మోటారు వద్ద విద్యుత్ షాక్‌కు గురై కుప్పకూలింది. గ్రామస్తులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ నరేందర్ తెలిపారు.
తెలంగాణ
విద్యుదాఘాతంతో మహిళ మృతి


