హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో ‘పల్లె నిద్ర’ చేపట్టిన పోలీసులు

అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమం చేపట్టారు. గ్రామాల్లో రాత్రి బస చేసి ప్రజలతో మమేకమై భద్రతా పరిస్థితులను సమీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.