హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మరో రూ.90 లక్షలతో వాటర్ ట్యాంక్ పనులు'

NDL: నంద్యాల 1వ వార్డులో నిలిచిపోయిన ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను మంగళవారం సాయంత్రం మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పరిశీలించారు. పెండింగ్ పనుల కోసం డీపీఎస్, ఎల్ఆర్ఎస్ నిధుల నుంచి రూ.90 లక్షలు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. ట్యాంక్ స్లాబ్, పైప్‌లైన్, పెయింటింగ్ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించాలని ఈ మేరకు అధికారులను ఫరూక్ ఆదేశించారు.