సత్యసాయి: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త అందించిన శాంతి, కరుణ, సోదరభావం మానవాళికి ఆదర్శనీయమని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య, మైత్రీభావంతో పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రజలకు సుఖశాంతులు చేకూరాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ఈద్ మిలాద్-ఉన్-నబి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్


