హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి ఇంటి వద్ద మున్సిపల్ కార్మికుల నిరసన

NTR: రాజధాని ప్రాంతానికి చెందిన మున్సిపల్ కార్మికులు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాత్రి గుణదలలోని మంత్రి నారాయణ నివాసం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. తమకు జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంత్రి నివాసం వద్ద ఆందోళనకు దిగారు.