హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రాప్ సర్వేపై అధికారుల తనిఖీ

GDWL: కేటీదొడ్డి మండలం ఉమిత్యాల గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలించారు. పంటల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని, రైతులకు ప్రభుత్వ పథకాలు, సేవలు సమర్థంగా అందేందుకు ఖచ్చితమైన సర్వే అవసరమన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజవర్ధన్‌రెడ్డి, ఏఈవోలు, వాలంటీర్లు పాల్గొన్నారు.