హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐటీఐ సీట్ల భర్తీకి సెప్టెంబరు 5 వరకు అవకాశం

NZB: నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో సీట్ల భర్తీకి వాక్-ఇన్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రిన్సిపల్ కన్వీనర్ యాదగిరి మంగళవారం తెలిపారు. మొదటి, రెండో విడతల్లో సీటు రాని అభ్యర్థులు ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 5 వరకు ఒరిజినల్ సర్టిఫికేట్లతో నేరుగా కళాశాలల్లో హాజరుకావాలన్నారు.మెరిట్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు.