హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలి

MHBD: డోర్నకల్‌ పట్టణంలో నూతనంగా నియమితులైన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు అంకితభావంతో పనిచేసి, ఆయా వర్గాల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడాలన్నారు. నూతన సభ్యులు గుగులోత్‌ కిషన్‌ నాయక్, పంజా కల్పన, గొల్లపల్లి రజినీకాంత్‌ ఎమ్మెల్యేను కలిశారు.