హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాదర్బార్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

కృష్ణా: గన్నవరంలో 28 మంది లబ్ధిదారులకు రూ.13.87 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం రాత్రి పంపిణీ చేశారు. పేదల వైద్యానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రజాదర్బార్ నిర్వహించి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.