హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోరుట్ల-వేములవాడ రహదారిపై పోలీసుల తనిఖీలు

SRCL: చందుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ బస్టాండ్ వద్ద కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిపై ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం సాయంత్రం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహన డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షలు నిర్వహించారు. వాహన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.