హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

KDP: ప్రొద్దుటూరులో గంజాయి విక్రయిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన పింటు కుమార్‌ను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 1.280 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.20 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.